గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » మంచు మనోజ్ "బిందాస్" సినిమా ట్రైలర్ మీ కోసం.. (Bindaas Cinema Trailer| Manchu manoj| Sheena| Vedam| Prayanam)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ప్రయాణం' ఫేమ్ మంచు మనోజ్ హీరోగా, షీనా కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బిందాస్". "అజయ్‌గాడి విజయగాథ" అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక.

ఈ చిత్రం ద్వారా వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరూ పోట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు వీరూ పోట్ల మాట్లాడుతూ... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందన్నారు. మంచు మనోజ్‌ గత చిత్రాల్లో చేసిన పాత్రకంటే ఇందులో భిన్నమైన కోణంలో కన్పిస్తాడు. అమాయకత్వం, అనుభవం ఆయన పాత్రలో కనిపిస్తాయన్నారు.

ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత సుంకర రామబ్రహ్మం అన్నారు.

ఇదిలా ఉంటే.. ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "ప్రయాణం" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మంచు మనోజ్‌కు "బిందాస్" సినిమా రెండో సినిమా కావడం గమనార్హం.

ఇంకా క్రేజీ హీరో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మల్టిస్టారర్ చిత్రం 'వేదం'లోనూ మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పతాకంపై 51వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న చిత్రంలోనూ మనోజ్ హీరోగా నటిస్తున్నాడు.

ఇంకేముంది..? "బిందాస్" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా..!?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బిందాస్, సినిమా, ట్రైలర్, మంచు మనోజ్, షీనా, వేదం, ప్రయాణం