గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » భూమిక, స్నేహాల "అమరావతి" సినిమా ట్రైలర్ (Amaravathi Cinema Trailer| Sneha | Bhumika chawla| Tarakaratana | Villain)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
సెక్సీతారలు భూమికా చావ్లా, స్నేహలు ప్రధాన పాత్రలో, నందమూరి తారకరత్న విలన్‌గా నటిస్తోన్న చిత్రం "అమరావతి". గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఈ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.

హారర్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవి తెలియజేశారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా చిత్రాలను తీసే రవిబాబు కథ చెప్పగానే ఆనంద్ ప్రసాద్ ముందుకు వచ్చారు. ప్రేమ, యాక్షన్ అంశాలున్నా అవి కథాగమనంలో ఆసక్తికరంగా సాగుతాయన్నారు.

మెడికో విద్యార్థులు ఓ పరిశోధన నిమిత్తం తలకోన అటవీ ప్రాంతాలలోకి వెళితే... అక్కడ జరిగే సంఘటలేమిటనేదే ఈ చిత్రమని సమాచారం. ఇందులో విశేషమేమిటంటే...? నందమూరి హీరోగా 9 చిత్రాలను ఏక కాలంలో ప్రారంభించి సక్సెస్ కొట్టలేకపోయిన నందమూరి తారకరత్న విలన్‌గా నటించడమే..! విలన్ పాత్రల ద్వారానైనా తారకరత్నకు గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తూ.. "అమరావతి" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా..?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అమరావతి, సినిమా, ట్రైలర్, స్నేహ, భూమిక చావ్లా, తారకరత్న, విలన్