జగపతిబాబు, ప్రియమణి, హంసానందిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ప్రవరాఖ్యుడు'. "శుభలగ్నం" వంటి హిట్ చిత్రాల ద్వారా మహిళా ప్రేక్షకుల్లో విశేష అభిమానం చూరగొన్న కథానాయకుడు జగపతిబాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని "ఆ నలుగురు" వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో "పెళ్లైన కొత్తలో" చిత్రం ద్వారా సక్సెస్ దర్శకుడిగా మారిన మదన్ తాజాగా దర్శకత్వ బాధ్యతలు వహించడం ఈ సినిమా విశేషం.
"టాలీ టు హాలీ ఫిలింస్" సంస్థపై ద్వితీయ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉందని డిసెంబరులోతెరపైకి రానుందని సహ నిర్మాత సుధాకర్ చాగంటి తెలిపారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన ఈ సినిమాను కామెడీ లవ్‌స్టోరీగా నిర్మిస్తున్నామన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ చిత్రమని అన్నారు. కీరవాణి మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుందని, ఈ సినిమా పాటల్ని డిస్కో తెక్‌లో కూడా వినేటట్లు సంగీతం అందించారని జగపతిబాబు వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. "ప్రవరాఖ్యుడు అంటే తన భార్య మినహా మిగిలినవారికి దూరంగా ఉండేవాడు. కానీ ఈ ప్రవరాఖ్యుడు తన ప్రమేయం లేకుండా మహిళల్ని ఆకర్షిస్తాడు. అది ఎలాగా అనేది సినిమా. ఇందులో జగపతిబాబు ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తాడు. ఇక ప్రియమణి పాత్ర సస్పెన్స్. ప్రేమకథలో కొత్తదనంగా ఉండే చిత్రమిదని" తెలియజేశారు.
ఇంకా ఈ సినిమాకు పాటలు: చైతన్యప్రసాద్, కెమెరా: సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూసి ఆనందించండి.