1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Aa..Aaa.. Ee... Eee

Srikanth | Aa..Aaa.. Ee... Eee | Sada | Meera Jasmine | Trailer | శ్రీకాంత్, సదా, మీరా "అ..ఆ.. ఇ...ఈ" ట్రైలర్

శ్రీకాంత్
"మహాత్మా" చిత్రంతో వంద సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్, గ్లామర్ హీరోయిన్లు మీరా జాస్మిన్, సదాలతో కలిసి నటించిన చిత్రం "అ.. ఆ.. ఇ.. ఈ..". ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో కామిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సెంటిమెంట్, మిస్టరీ వంటి పలు అంశాలను కూడా మేళవించారు. ఇందులో శ్రీకాంత్ మీరాజాస్మిన్, సదాల ముద్దుల భర్తగా అద్భుతంగా నటించాడు. మీరాజాస్మిన్, సదాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

బ్రహ్మానందం, అలి, సునీల్, ఎం.ఎస్. నారాయణ, కోవై సరళ, రఘుబాబులు ఈ సినిమాలో హాస్యాన్ని పండించారు. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పండించే ఈ చిత్రానికి ఎమ్ఎమ్ సురేఖ అందించిన సంగీతం చక్కగా అమరింది. మర్డర్ మిస్టరీ, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన "అ.. ఆ.. ఇ.. ఈ.." చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా..?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT