1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Venkatesh

Namo Venkatesa Cinema Trailer | Venkatesh | Trisha | Sreenu Vaitla | వెంకీ, త్రిషల "నమో వెంకటేశ" ట్రైలర్ మీ కోసం..

నమో వెంకటేశ
విక్టరీ వెంటేష్, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "నమో వెంకటేశ". శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీ, రాము, అనిల్ నిర్మిస్తున్నారు. డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. నానక్‌రామ్‌గూడాలో వెంకటేష్, త్రిష, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, ఢిల్లీ రాజేశ్వరి, తెలంగాణా శకుంతల, బెనర్జీ, బ్రహ్మానందం, మాస్టర్ భరత్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను చిత్రం గురించి చెపుతూ.. "వెంకటేష్‌తో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నా కుదరలేదు. నిర్మాతలైన వెంకీ స్నేహితులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ మోహన్ కథ చెప్పగానే వెంకటేష్‌కు కరెక్ట్‌గా సరిపోతుందనిపించింది. వెంకటేష్‌తో చాలా సరదాగా గడిచింది. మళ్లీ ఆయనతో చిత్రాన్ని చేయాలనుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం బాగా ఇచ్చాడు. త్రిష పాత్ర కీలకం. ఆమె చుట్టూ కథ తిరుగుతుంది. ఇక బ్రహ్మానందం పాత్ర హైలెట్. పారిస్ ప్రసాద్‌గా నటించాడు. అన్ని వర్గాల వారిని అలరించే చిత్రమవుతుంది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తయింది" అని అన్నారు.

హీరో వెంకటేష్ మాట్లాడుతూ... "ఈ సినిమాకు ఇద్దరు హీరోలు. నేను, బ్రహ్మానందం. పర్వతనేని వెంకటరమణ నా పాత్ర పేరు. వెంటేశ్వరస్వామి భక్తుడిని. చాలా సరదాగా సాగే కుటుంబ కథా చిత్రమిద"ని తెలిపారు. దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ... ఆడియోను డిసెంబరులోనూ... చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు.