Adurs Cinema Trailer | NTR | Nayantara | Shreya | Sridevi | యంగ్ టైగర్ ఎన్టీఆర్ "అదుర్స్" ట్రైలర్ మీ కోసం...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అదుర్స్’. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. హీరోయిన్‌లుగా నయనతార, షీలా నటిస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించిన అందాల సుందరి శ్రీదేవితో ఈ జూనియర్ ఎన్టీఆర్ నటించాలనే తహతహలాడుతున్నాడట. ఈ కోరిక మేరకే శ్రీదేవి పోలీకలతో ఉండే షీలాను "అదుర్స్"లో ఓ కథానాయికగా సిఫార్సు చేశాడని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.
ఇంకా షీలాతో రెండు పాటల్లో నర్తించిన ఎన్టీఆర్‌కు శ్రీదేవితో డాన్స్ చేసిన ఫీలింగ్ వచ్చిందట. ఎన్టీఆర్‌తోనే గుర్తింపు కొట్టేసిన షీలా స్టిల్స్ చూసిన ప్రేక్షకులు కూడా నయనతారను ప్రక్కన బెట్టి షీలాకు మంచి మార్కులు వేస్తున్నారు.
పోస్టర్స్‌లో కూడా నయనతార కన్నా షీలానే అందంగా వుందంటూ కుర్రకారు షీలాకు ఓట్లు వేస్తున్నారు. ఇది తెలుసుకున్న నయనతార మాత్రం సినిమా విడుదల తర్వాత తనకు మంచి పేరు వస్తుందంటూ ఫోజులిస్తుందని సమాచారం.
ఇదిలా వుంటే అసలే పరిస్థితులు కొత్త సినిమాల విడుదలకి అనుకూలంగా లేవు. సమైక్యాంధ్రకే సై అన్న హరికృష్ణ మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీంతో ఎన్టీఆర్ సినిమా వస్తే ఖబడ్దార్ అని తెలంగాణా వాదులు హుకుం జారీ చేశారు.
ఇప్పటికే ఎన్టీఆర్ తదుపరి చిత్రం "బృందావనం" షూటింగ్‌పై తెరాస దాడులు జరిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ "అదుర్స్"ను విడుదల చేసేందుకు నిర్మాతలు, దర్శకులు వెనుకడుగు వేస్తున్నారు.
ఇంకేముంది..? సినిమా విడుదల సంగతిని అటుంచి "అదుర్స్" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.