1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Kasco | Cinema | Trailer | Vaibhav | Sweta Basu Prasad | Ride | వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్ మీ కోసం..

కాస్కో
కొత్త బంగారులోకం, రైడ్ చిత్రాలతో యువతలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న శ్వేతాబసు తాజాగా "కాస్కో" అనే చిత్రంలో చేస్తోంది. వైభవ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించగా, భారతి నిర్మాణ పగ్గాలు చేపట్టారు.

ఈ సినిమా గురించి చిత్ర సమర్పకుడు ఎ.కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. "జీవితం విలువ తెలిసిన యువకుడు మా కథానాయకుడు. అల్లరి వ్యవహారాలకు అతని దినచర్యలో చోటులేదు. ఎదుటివాడు ఎంతటివాడైనా తేడా వస్తే 'కాస్కో' అని సవాలు విసరడమే అతనికి తెలుసు. అలా విసిరిన సవాల్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు? అనేది సస్పెన్స్‌. త్వరలో సినిమాను విడుదల చేస్తాం" అని అన్నారు.

గౌరీపండిట్‌, జయప్రకాష్‌రెడ్డి, ప్రదీప్‌రావత్‌, చలపతిరావు, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రేమ్‌జీ, సహ నిర్మాత: ఎ.సునీల్‌, ఛాయాగ్రహణం: అఖిలన్‌.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M