Yagam Cinema Trailer | Navdeep | Bhumika | Kim Sharma | నవదీప్, భూమికల "యాగం" ట్రైలర్‌ను తిలకించండి
అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన "యాగం" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాజు, ప్రవీణ్‌లు నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలో నవదీప్, భూమిక, కిమ్ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమిక ఎయిర్ హొస్టెస్‌గా నటిస్తోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... బ్యాంకాక్‌లోని రూరల్ ఏరియాలో ఓ బార్లో నవదీప్, కిమ్ శర్మ పనిచేస్తుంటారు. భూమిక ఎయిర్ హొస్టెస్‌గా వర్క్ చేస్తుంటారు. వీరి ముగ్గురి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఓ వైపు ఎంతో జోవియల్‌గా, సరదాగా వుంటూ మరోవైపు సీరియస్‌గానూ వుండే కథానాయకుని పాత్ర ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీతో కూడుకొన్నది" అని అన్నారు. థాయ్‌లాండ్ జాకీచాన్‌గా పిలువబడే టోనిజా చిత్రాలకు ఫైట్స్‌ను సమకూర్చే జైకా టీం ‘కేశ’ ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాల్ని సమకూర్చారన్నారు.
అలీ, హర్షవర్థన్, అజయ్, బ్రహ్మానందం, రఘుబాబు, రాహుల్ దేవ్, ఇంద్రకుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.