1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Rana

Leader Movie Trailer | Rana | Richa Gangopadhyay | Priya Anand | Shekar Kammula | "లీడర్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

లీడర్
డా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు "రాణా"ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్నినిర్మించింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాలేజీ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ‘హ్యాపిడేస్’గా మలచిన "శేఖర్ కమ్ముల" నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ‘లీడర్’ చిత్రంలో ద్వారా చెప్పనున్నారు. అయితే ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా ‘లీడర్’ కథను మలచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ను ఒక ఆదర్శనేతగా తీసుకుని కథ అల్లినట్లు తెలుస్తోంది.

డి. రామానాయుడు మనవడు సురేష్ బాబు కుమారుడు రాణా హీరోగా రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, సుహాసిని మణిరత్నం, రావ్ రమేష్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
SELVI.M