Om Shanti Cinema Trailer | Kajal Agarwal | Navdeep | Nikhil | Bindu Madhavi | Aditi Sharma | కాజల్, నవదీప్‌ల "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం..
నూతన సంవత్సరం 2010, జనవరి 13న సంక్రాంతి కానుకగా "ఓం శాంతి" ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సంక్రాంతికి అందించిన "అగ్నిపర్వతం", "పెళ్లి సందడి" వంటి చిత్రాలు అద్భుత విజయాలను సాధించిన నేపధ్యంలో "ఓం శాంతి" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విభిన్న కథా చిత్రం అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.
మల్టీస్టారర్ చిత్రంగా అందర్నీ ఆకట్టుకోనున్న ఈ చిత్రంలో నిడివి తక్కువగా ఉండే ఓ కీలకమైన పాత్రను తమిళ హీరో మాధవన్ పోషించనున్నారని తెలిసింది. తమిళ, హిందీ చిత్రాలతో పాటు 'సఖి', 'చెలి' వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు.
ఇంకా నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందు మాధవి, అదితి శర్మ, మురళీమోహన్, రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: జయన్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, మాటలు: నాగరాజు, నిర్మాత: శేషు, ప్రియాంక చలసాని, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాష్.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "ఓం శాంతి" సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..