Coffee bar movie trailer | Geetha Krishna | Sashank | Biyanka | Atul Kulkarni | "కాఫీబార్" ఎలా ఉంటుందో ట్రైలర్లో చూడండి
గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం "కాఫీబార్". బ్లూఫాక్స్ సినిమా పతాకంపై రూపొందుతున్న 'కాఫీబార్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
శశాంక్, బియాంక దేశాయ్, అతుల్ కులకర్ణి, సుమన్, గిరీష్ కర్నాడ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోందని గీతాకృష్ణ అన్నారు.
కాఫీబార్‌ను తెలుగు, తమిళం, కన్నడ బాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని గీతాకృష్ణ చెప్పారు. ఇందులోని పాటలన్ని మెలోడి ప్రధానంగా అలరిస్తాయని తెలిపారు. కళాత్మక చిత్రానికి కమర్షియల్ హంగులు జోడిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో 'కాఫీబార్ చూస్తే తెలుస్తుందని గీతాకృష్ణ వెల్లడించారు. మైండ్‌గేమ్ ప్రధానంగా ఆద్యంతం ఆసక్తికరంగా చిత్ర కథ, కథనాలు ఉంటాయని దర్శకనిర్మాత గీతాకృష్ణ తెలియజేశారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం..