1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Nikhil

Kalavar king Cinema Trailer | Nikhil | Swetha Basu Prasad | Family Entertainer | "కళావర్ కింగ్"ను ట్రైలర్లో తిలకించండి

కళావర్ కింగ్
నిఖిల్‌, శ్వేతా బసుప్రసాద్‌ హీరో హీరోయిన్లుగా శ్రీ సాయికృష్ణ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "కళావర్ కింగ్". ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో డి.యస్‌.రావ్, ఎం.చంద్రశేఖర్‌రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'కళావర్‌ కింగ్‌' మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు కూడా జరుపుకుంటున్నాడు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో తాను సరదాగా జీవితం గడిపే అల్లరి యువకుడి పాత్రను పోషిస్తున్నాడన్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.

హీరోయిన్‌ శ్వేతబసుప్రసాద్ మాట్లాడుతూ 'ఇందులో వినోదప్రధానమైన పాత్రని పోషిస్తున్నాను. హీరోకు, తనకు మధ్య జరిగే సన్నివేశాలు మిక్కీ మౌస్‌ షో లాగా కామెడీ వుంటుందని చెప్పింది.

దర్శకుడు ఎల్‌.సురేష్‌ మాట్లాడుతూ 'తాను బాలు మహేంద్ర దగ్గర సహాయకుడిగా పనిచేశాను. ఈ చిత్రంలో హాస్యంతో పాటు సెంటిమెంట్‌ కూడా ఉంటుందన్నారు. నిర్మాతల్లో ఒకరైన చంద్ర శేఖర్‌, డి.యస్‌.రావ్ మాట్లాడుతూ 'ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
About Writer
SELVI.M