Kasco Cinema Trailer | Vaibhav | Sweta Basu Prasad | Ride | Vaibhav | Sweta Basu Prasad | Ride | వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్‌ను వీక్షించండి
వైభవ్, శ్వేతబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కాస్కో". బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఎ. భారతి నిర్మించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోన్న "కాస్కో" చిత్రాన్ని దర్శకుడు కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచారని సినీ జనం అంటున్నారు. కిడ్నాప్ అయిన ప్రేయసిని రౌడీల వద్ద నుంచి హీరో ఎలా కాపాడుతాడనే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేయసిని రౌడీల బారి నుంచి రక్షించే క్రమంలో హీరో రౌడీయిజాన్ని ఎలా అంతం చేశాడన్నదే ఈ సినిమా సారాంశం.
కిడ్నాప్ అయిన ప్రియురాలి కోసం పోరాడే సన్నివేశాల్లో వైభవ్ చక్కగా నటించాడు. ఇందులో శ్వేతబసుప్రసాద్, గౌరిపండిట్ అందచందాలు యువతరాన్ని అలరిస్తాయి. ఇక బ్రహ్మానందం కామెడీ ఈ లినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలోని కొన్ని సన్వివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.