Adurs Cinema Trailer | NTR | Nayantara | Sheela | "అదుర్స్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి
నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, షీలా, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన "అదుర్స్" చిత్రం విడుదల వాయిదా పడింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అదుర్స్ చిత్రం వాస్తవానికి డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది.
కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాన్ని విడుదల చేస్తే బంద్‌లు, ఇతర కారణాల వల్ల చిత్ర ప్రదర్శన ఒక్క రోజు ఆగినా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుందని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్. టి. ఆర్ తండ్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఇటివల ఢిల్లీ లో మాట్లాడుతూ తమ పార్టీ సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడంతో టి.ఆర్.ఎస్. పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అదుర్స్ స్టిల్స్‌ను చించి, కాల్చి వేసింది. ఇంకా అదుర్స్ చిత్రం తెలంగాణా ప్రాంతంలో ప్రదర్శించడానికి వీలులేదని హెచ్చరించింది.
దీనికి తోడు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా రోజు రోజుకు ఉధృతం అవుతున్న నేపథ్యంలో అదుర్స్ చిత్రాన్ని విడుదల చేయడం మంచిది కాదని నిర్మాతలు నిర్ణయించుకొని జనవరి ఐదో తేదీకి వాయిదా వేశారు. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాక పోతే మరో సారి వాయిదా పడే అవకాశం కూడా ఉందని సినీ జనం అంటున్నారు.