హాయ్ హాయ్ నాయకా! మొత్తానికి రేపే రంగుల్లో వచ్చేస్తున్నాడు. నలుపు తెలుపు "మాయాబజార్" రంగుల మాయలో. ఘటోత్కచుడు ఆరగించిన వివాహ భోజన వంటకాలు, అందాల శశిరేఖ ఆభరణాలు, ప్రతాపాలను నమ్ముకున్న తమ్ముడు అభిమన్యుడి కోసం లోకాలను కకావికలు చేసే ఘటోత్కచుడు అంతా రంగుల్లో కన్పించనున్నారు.
కె.వి.రెడ్డి సృష్టించిన ఈ నలుపు తెలుపు కళా ఖండానికి గోల్డెన్‌స్టోన్ సంస్థ రంగులు అద్దింది. అద్భుతమైన ఈ సినిమాను రంగుల్లో చూసే అందమైన అవకాశం ఈ నెల 30వ తేదీన రానుంది. వెండితెరపై శ్రీకృష్ణుడి గెటప్‌లో ఎన్టీఆర్ పంచవర్ణ శోభితంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం... వీక్షించండి నాటి మేటి నటీనటులను రంగుల "మాయాబజార్"లో...