1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Genelia

జెనీలియా "కథ"ను ట్రైలర్లో తిలకించండి

కథ
బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం "కథ". జెనీలియా, అరుణ్‌ అదిత్‌ జంటగా రాగా శ్రీనివాస్‌ దర్శకత్వంలో జస్ట్‌ ఎల్లో పతాకంపై గుణ్ణం ఊర్మిళ నిర్మిస్తున్న ఈ సినిమా.. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఉంటుందనీ, అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందిందని చిత్ర సమర్పకలు గుణ్ణం గంగరాజు అన్నారు.

ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా జెనీలియా కనిపిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తిని రేకెత్తించే విధంగా తెరకెక్కిన ఈ కథలో జెనీలియా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ప్రకాష్‌రాజ్‌, షఫీ, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.కె.బాలచంద్రన్‌, కళ: రవీందర్‌, కెమెరా: ఆండ్రూ, మాటలు: గుణ్ణం గంగరాజు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం..