గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » సీతారాముల కళ్యాణం (లంకలో) ట్రైలర్ మీ కోసం.. (Seetharamula kalyanam Lankalo | Cinema | Trailer | Nitin | Hansika)
ట్రైలర్స్
Bookmark and Share Feedback Print
 
నితిన్‌, హన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారాముల కళ్యాణం (లంకలో). ఇటీవలే లవ్లీ ఎంటర్‌టైనర్‌గా విడుదలై, ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్న ఈ చిత్రాన్ని.. వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వర్‌ దర్శకత్వంలో, డా. మళ్ళ విజయప్రసాద్‌ నిర్మించారు.

సినిమా విడుదల సందర్భంగా హీరో నితిన్‌ మాట్లాడుతూ.. 'సీతారాముల కళ్యాణం లంకలో అనేది చిత్రానికి యాప్ట్‌ టైటిల్‌.అనూప్‌ మ్యూజిక్‌‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. సంపూర్ణ హాస్య రసభరిత చిత్రమిది. సీతారాముల కళ్యాణం లంకలో ఏ విధంగా జరిగింది? అనే అంశం ఆద్యంతం ఆసక్తికరంగా వుంటుంది" అని అన్నారు.

నిర్మాత మళ్ళ విజయప్రసాద్‌ మాట్లాడుతూ 'మా సంస్థలో వచ్చిన 'సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం చిత్రాన్ని ఆదరించినట్టే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు.

బ్రహ్మానందం, సుమన్‌, వేణుమాధవ్‌, అలీ, యం.యస్‌. నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌, కెమెరా: జోషి, నిర్మాత: డా.మళ్ళ విజయప్రసాద్‌, దర్శకత్వం: ఈశ్వర్‌.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సీతారాముల కళ్యాణం లంకలో, సినిమా, ట్రైలర్, నితిన్, హన్సిక