కాజల్ అగర్వాల్ "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం...
ప్రతిష్టాత్మక వైజయంతి హౌస్ నుండి త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ బ్యానర్‌పై సి. ధర్మరాజు సమర్పణలో శేషు ప్రియాంక చలసాని కొత్త దర్శకుడు ప్రకాష్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "ఓం శాంతి". ఈ చిత్రంలో "మగధీర" ఫేమ్ కాజల్ అగర్వాల్, ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బింధు మాధవి, హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్, నవదీప్, అదితి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.
"ఐదు కథలు..ఒక నిజం" అంటూ ఊదరకొట్టి ఏదో గొప్ప చిత్రం రాబోతోంది అన్నంత గొప్పగా చెప్పి తెరపైకి వచ్చిన ఓం శాంతిలో కథ చెప్పటం చేతకాక, స్క్రీన్ ప్లే ఇబ్బందితో ప్రేక్షకులకు పూర్తి స్ధాయి చిత్ర యూనిట్ అశాంతినే మిగిల్చారని సినీ పండితులు అంటున్నారు. ఐదు కథలు దేనికదే సంబంధం లేకుండా నడుస్తూంటాయి. ఐదు కథలను సమ్మేళన పరచి.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మురళీ మోహన్, రవి కాలే, రఘు బాబు తదితరులు నటించారు.
ఇంకా ఈ చిత్రానికి కెమేరా: జయనన్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, మాటలు: నాగరాజు గంధం, నిర్మాత: శేషు ప్రియాంక చలసాని, కథ, స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ప్రకాష్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.