1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Children film

Bunty | Children film | Master Srihari Dutta | Trailer | బంటి... ద బ్యాడ్ బోయ్: ట్రెయిలర్

బంటి
బాలల అల్లరి చేష్టలను ఆధారంగా చేసుకుని ఇంతకుముందు ఎన్నో చిత్రాలు వచ్చాయి. తాజాగా మాస్టర్‌ శ్రీహరి దత్తా టైటిల్‌ పాత్రాధారిగా వైష్ణవి ఫిల్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె.రవిప్రకాష్‌ నిర్మించిన 'బంటి..ద బ్యాడ్‌ బోయ్‌' వచ్చింది.

'బంటి' దర్శక నిర్మాత రవిప్రకాష్‌ మాట్లాడుతూ, 'ఇది కేవలం బాలల కోసమే తీసిన సినిమా కాదు. సకుటుంబంగా చూడాల్సిన సినిమా. నిజ జీవితంలో పిల్లలు ఎలా ఉంటారు, ఏం చేస్తే వారు సరైన మార్గంలో పయనిస్తారనేది ఈ చిత్ర కథాంశం. చూసినవాళ్లంతా అభినందించడం సంతోషంగా అనిపిస్తోంది.'అని చెప్పారు.

బేబి వైష్ణవి, సత్యకృష్ణ, కృష్ణవేణి, రాగిణి, జాన్‌ బాప్టిస్ట్‌, వి.నాగివీడు, రొణ్ణంకి, జయలక్ష్మి తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం:లలిత్‌ సురేశ్‌, కూర్పు: వెంకటేశ్వర్లు కామేపల్లి, సినిమాటోగ్రఫీ: ఆర్‌.పి. పినిశెట్టి, కథ మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: కె.రవిప్రకాశ్‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT