Akasaramanna | Cinema | Trailer | Allari Naresh Sivaji | Meera jasmine | Gowri Pandit | "ఆకాశరామన్న"ను ట్రైలర్లో తిలకించండి.
అల్లరినరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరాజాస్మిన్, గౌరిపండిట్ హీరోయిన్లుగా నటించిన చిత్రం "ఆకాశరామన్న". "ఫ్లాష్‌న్యూస్" ఫేం అశోక్ దర్శకత్వం వహించగా, మన్యం సూర్యనారాయణ సమర్పణలో.. మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి మన్యం రమేష్ మాట్లాడుతూ.. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా ఈ చిత్రంలో రావురమేష్, టార్జన్, రఘు, ఖయూం, వేణు, సన, గీతాసింద్, బండజ్యోతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా.. శ్రీరామ్, సంగీతం.. చక్రి, మాటలు.. చంద్రశేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అశోక్.
దర్శకుడు మాట్లాడుతూ విజువల్స్ ప్రాధాన్యత ఉన్న సినిమా ఇదని, స్క్రీన్‌ప్లే వైవిధ్యంగా ఉంటుందని, ఇదే సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. క్లైమాక్స్ నుంచి సినిమా ప్రారంభమవుతుందని, కథాగమనం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు వెల్లడించారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.