1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Vishal

Khiladi | Vishal | Trailer | గరం గరం "కిలాడి" ట్రెయిలర్... వీక్షించండి

కిలాడి
పందెం కోడి, పొగరు, భరణి మొదలైన సూపర్ హిట్ చిత్రాల ద్వారా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యాక్షన్ హీరో విశాల్ ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని చేశారు. జీకే ఫిలిమ్ కార్పొరేషన్ పతాకంపైన కిలాడి అనే క్రేజీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.

నిర్మాత విక్రమ్ కృష్ణ మాట్లాడుతూ... "మా కిలాడి చిత్రంలో విశాల్ ఇంతవరకూ నటించనటువంటి ప్లే బాయ్ పాత్రను అద్వితీయంగా పోషించారు. తను దేన్నైనా ఎన్నిక చేసుకునే ముందు మూడు విధాలుగా ఆలోచించుకోవడం అలవాటు. ఆ విధంగానే జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిల్ని అనుకుంటాడు. ఈ ముగ్గురిలో ఎవరిని కిలాడి సొంతం చేసుకుంటాడన్నదాన్ని వెండితెరమీద చూడాల్సిందే" అని చెపుతున్నారు.

కిలాడికి సంబంధించిన ట్రెయిలర్ చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT