1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. మంచు మనోజ్ "బిందాస్" ట్రెయిలర్

Bindass, Trailer, Manchu Manoj, Sheena | మంచు మనోజ్ "బిందాస్" ట్రెయిలర్

బిందాస్
ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ప్రయాణం' ఫేమ్ మంచు మనోజ్ హీరోగా, షీనా కథానాయికగా నటించిన చిత్రం "బిందాస్". "అజయ్‌గాడి విజయగాథ" అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరూ పోట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఇదిలా ఉంటే.. ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "ప్రయాణం" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మంచు మనోజ్‌కు "బిందాస్" సినిమా రెండో సినిమా కావడం గమనార్హం.

"బిందాస్" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా..
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT