Sadhyam film Trailer | Jagapati Babu | Priyamani | Kumar Brothers | జగపతిబాబు "సాధ్యం" ట్రెయిలర్
జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతోన్న చిత్రం సాధ్యం. ఈ చిత్రాన్ని కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... "వైవిద్యమైన కథ, కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆది' చిత్రం ఫేమ్ కీర్తిచావ్లా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇప్పటివరకూ జగపతిబాబు, ప్రియమణిలు తమ కెరీర్‌లో పోషించనటువంటి భిన్నమైన పాత్రలను ఇందులో చేస్తున్నారు. చిన్న చరణ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు మంచి స్పందన వస్తోంది.
హీరో, హీరోయిన్ల పాత్రలు అందరికీ థ్రిల్లింగ్ కలిగిస్తాయి. కథ, కథనాలే చిత్రానికి ప్రధాన బలం. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము" అన్నారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రాజు, ప్రగతి, మధుమణి, మున్నా వేణు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కథ- స్క్రీన్ ప్లే: శ్యామ్ మనోహర్, మాటలు: శ్యామ్, సంగీతం: చిన్ని చరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జి. హరినాథ్, ఎ.పాండురంగ, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...