1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Allu Arjun

Varudu | Allu Arjun | Gunasekhar | Arya | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్

వరుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియో మార్చి 7న రిలీజ్ అయింది.

ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు.

చిత్రాన్ని ఈ నెలాఖరికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"న్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT