1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Simha

Balakrishna | Simha | Nayanatara | Sneha Ullal | Namita | నందమూరి బాలకృష్ణ "సింహా" ట్రెయిలర్

బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన "సింహా"లో బాలకృష్ణ సరసన నయనతార, స్నేహాఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణను భిన్న కోణంలో ఆవిష్కరించామని నిర్మాత పరుచూరి కిరీటీ అన్నారు.

షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అభిమానిగా ఎలా ఉండాలో? ఆ విధంగా బాలయ్య సినిమా చేశాను. రెండు పాత్రల్లో నటనతో బాలకృష్ణ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాడు. ఇంకా అన్ని వర్గాల వారిని అలరించే చిత్రంగా "సింహా" ఉంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం..
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT