1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Aditya Babu

Chalaki | Aditya Babu | Roja | Chiranjeevi | Megastar | చలాకీ ట్రెయిలర్

చలాకి
ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి "చలాకి" అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా మాదేష్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రోమా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందుతోంది. లేడీస్ కాలేజీలో ఓ కుర్రాడు ఎలా చేరాడు? దానికి కారణాలేమిటి? అన్న అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

హీరో ఆదిత్య మాట్లాడుతూ... గతంలో ఆదిత్యబేనర్‌లో రెండు విజయవంతమైన చిత్రాలు నిర్మించాం. మూడవ చిత్రానికి నేనే హీరోగా పరిచయం అవుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా 8వ తరగతిలోనే సినిమాల్లోకి రావాలని కోరిక ఉండేది. పెద్దలు ఇంజనీరింగ్ చదివాక చేద్దువుగానీ అన్నారు. అనుకున్నట్లు నా ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. కథపరంగా నేను ఇంజనీరింగ్ చదువుతుంటాను. ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా : బాలమురుగన్, సంగీతం : హరికృష్ణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కె. మాదేష్.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి