Simha | Balakrishna | Tollywood | Trailer | చూడూ.. ఒకవైపే చూడూ.. రెండోవైపు చూడాలనుకోకూ... మాడిపోతావ్..!!
ఈ డైలాగ్ ఇపుడు టాలీవుడ్‌లో మారుమోగుతోంది. తెలుగు ప్రేక్షకులు బాలయ్య చిత్రం సింహాను సూపర్ సక్సెస్ చేశారు. నిజానికి సింహా టైటిల్ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను, పక్కా బాలయ్య మార్క్ సినిమా తీశాడు.
ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని సంపాదించుకున్నాడో అలాంటి అభిమానులు మెచ్చేలా, వారి అంచనాలకు అనుగుణంగా బాలయ్య కథాంశాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు నాలుగు పాటలుకూడా బాగుండడంతో సింహా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్ అయ్యింది.
అయితే భద్ర, తులసిలో ఉన్నట్లే... దర్శకుడు బాలయ్య రేంజ్‌కు తగినట్లుగా బాంబు పేలుళ్లు, కత్తులతో నరకడాలు మామూలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్‌లు ఆవేశంగా బూతులు ఉన్నా సన్నివేశపరంగా కొట్టకుపోయాయి. మొత్తమ్మీద ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మెప్పించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...