1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Allu Arjun

Vedam | Allu Arjun | Manchu Manoj | Anushka | Deeksha | Trailers | అల్లు అర్జున్ - మనోజ్ - అనుష్కల వేదం ట్రెయిలర్

వేదం
వరుడు చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కాస్తంత నీరసించిన అల్లు అర్జున్ లేటెస్ట్‌గా వేదం చిత్రంతో కొత్త ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌తో కలిసి నటించిన వేదం చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

అల్లు అర్జున్, మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ రూపొందించిన 'వేదం' చిత్రాన్ని ఈ నెలలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్‌తో సాగే పాత్రను చేస్తున్నాడు. అనుష్క వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్‌స్టార్‌గానూ నటిస్తున్నారు.

'బిందాస్'తో ఓకే అనిపించుకున్న మనోజ్, ఇప్పటికే స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, 'అరుంధతి ' చిత్రంతో ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న అనుష్కల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT