Jhummandi nadam | Manoj | Tapsi | Mohan babu | Chiranjeevi | Balakrishna | "ఝుమ్మంది నాదం" ఆడియో కార్యక్రమంలో చిరు -బాలయ్య
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్, తాప్సీ జంటగా నటించిన ఝుమ్మంది నాదం ఆడియో విడుదల శుక్రవారం రాత్రి రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, దాసరి నారాయణరావు హాజరుకావడం ప్రత్యేకత సంతరించుకుంది.
బాలకృష్ణ మాట్లాడుతూ.. చక్కటి ఫీల్ గల టైటిల్. కీరవాణి కాంబినేషన్ అంటేనే సక్సెస్‌ఫుల్. నిర్మాత లక్ష్మీప్రసన్న వాళ్ల నాన్నలా మంచి మనస్తత్వం. అన్ని శాఖలను ఆమె సమన్వయం చేస్తూ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. నటిగా కూడా మారిన లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
మోహన్ మాట్లాడుతూ... నేను నటించిన అల్లుడుగారు సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైతే చిరంజీవి ఫస్ట్‌షాట్ డైరెక్ట్ చేశాడు. సిల్వర్ జూబ్లీ ఆడింది. మా ఇద్దరి మధ్య మంచి సంబంధమున్నది. మా మధ్య ఏదైనా వస్తే అది తాత్కాలికమే. మా అమ్మాయి నిర్మాత అని ఫోన్‌లో పిలవగానే వెంటనే వచ్చారు. అలాగే నా బ్యానర్‌ను 82లో ఎన్టీఆర్ ప్రారంభించారు. 92లో ఆయనతో కలిసి మేజర్ చంద్రకాంత్ తీయడం యాదృశ్చికమే అంటూ వివరించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. అనుకోకుండా వేరే రంగంలో అడుగుపెట్టాను. అక్కడ మానసిక ఒత్తిడి తప్పదు. ఇక్కడికి వచ్చాక కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. కీరవాణి, రాఘవేంద్రరావులది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మోహన్ బాబు సినిమాను గుర్తుకు తెస్తోంది. మనోజ్ తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటాడని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.