1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Shahrukh Khan

Ra.One Cinema Trailer video | Shahrukh Khan | Arjun Rampal | Kareena Kapoor | Rajinikanth, | దీపావళికి బాలీవుడ్‌ను షేక్ చేయనున్న షారుక్ "రా.వన్": ట్రెయిలర్ వీడియో

షారుక్ ఖాన్
షారుక్ ఖాన్, అర్జున్ రాంపాల్, కరీనా కపూర్, అర్మన్ వర్మ, సంజయ్ దత్, ప్రియాంకా చోప్రా, సతీష్ షా వంటి భారీ తారాగణంతో ఈ నెల 26న దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రా.వన్. ఈ చిత్రంలో షారుక్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడని దర్శకుడు అనుభవ్ సిన్హా చెపుతున్నారు.

IFM


ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో రోబో రజినీకాంత్ కనిపించనున్నారు. అదేవిధంగా సంజయ్ దత్, ప్రియాంకా చోప్రాలు కూడా అతిథి పాత్రల్లో కనిపిస్తారు. మొత్తమ్మీద దీపావళి సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

IFM


అత్యాధునిక సాంకేతక సహకారంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బాద్షా షారుక్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT