1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్
  6. Beans

Green Peas | Beans | Carrot | Papaya | Cherry | Pineapple | Milk | Maida | Butter | Pepper Powder | Salt | వెజిటబుల్స్, ఫ్రూట్స్‌తో పోషకాల "రష్యన్‌ సలాడ్‌"

పచ్చి బఠాణీలు
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చి బఠాణీలు.. ఒక కప్పు
బీన్స్, క్యారెట్ ముక్కలు.. చెరో కప్పు
బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్ ముక్కలు.. అన్నీ కలిపి రెండు కప్పులు
పాలు.. ఒక కప్పు
మైదా, వెన్న.. అర టీస్పూన్ చొప్పున
మిరియాల పొడి.. ఒక టీ.
ఉప్పు.. అర టీ.

తయారీ విధానం :
ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి. పైన మిరియాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి