1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. మాంసాహారం

కాకరతో రొయ్యల కూర

వంటకాలు మాంసాహారం రొయ్యలు కాకరకాయలు ఉల్లిపాయలు మజ్జిగ కొత్తిమీర పసుపు ఉప్పు కారం నూనె పచ్చిమిర్చి
FileFILE
కావలసిన పదార్థాలు :
రొయ్యలు.... అరకిలో
కాకరకాయలు... ముప్పావు కిలో
ఉల్లిపాయలు... రెండు
మజ్జిగ... ఒక గ్లాసు
కొత్తిమీర... ఒక కట్ట
పసుపు... కొంచెం
ఉప్ప... తగినంత
కారం... నాలుగు స్పూన్‌లు
నూనె... 100 గ్రాములు
పచ్చిమిర్చి... ఎనిమిది

తయారీ విధానం :
కాకరకాయలను ముక్కలుగా కోసి మజ్జిగతో ఉడికించి పక్కన పెట్టుకోండి. బాణలిలో నూనె పోసి బాగా కాగాక... రొయ్యలు, ఉల్లిపాయలు, మజ్జిగ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బాగా వేగిన తర్వాత ఉడికించిన కాకరకాయల ముక్కల్ని గట్టిగా పిండి కూరలో వేసుకోవాలి. కాసేపు వేగిన తరువాత పసుపు, ఉప్పు, కారం, కొద్దగా నీటిని కలిపి ఎర్రగా వేయించాలి. గ్రేవీ చిక్కబడిన తరువాత దించి వేడి వేడి రైస్‌తో వడ్డించాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి