1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. మాంసాహారం
  6. ఫిష్ స్పైసీ ఫ్రై చాప్స్

Fish Spicy Fry Chaps | ఫిష్ స్పైసీ ఫ్రై చాప్స్

వంటకాలు మాంసాహారం చేప ఉప్పు కార్న్ఫ్లోర్ వెనిగర్ అల్లం కారం పసుపు నూనె గరంమసాలా ఫుడ్ కలర్ రెడ్ ఆరెంజ్
FileFILE
కావలసిన పదార్థాలు :
పెద్దసైజు చేపముక్కలు... అరకేజీ
నూనె... వేయించేందుకు సరిపడా
ఉప్పు... తగినంత
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
వెనిగర్... రెండు టీ.
ఉల్లిరసం... రెండు టీ.
కొత్తిమీర తురుము.. రెండు టీ.
అల్లంముద్ద... ఒక టీ.
పచ్చిమిర్చి పేస్టు... ఒక టీ.
కారం... ఒక టీ.
పసుపు... పావు టీ.
మిరియాలపొడి... పావు టీ.
గరంమసాలా... పావు టీ.
ఆరెంజ్ లేదా రెడ్ కలర్ ఫుడ్ కలర్... పావు టీ.

తయారీ విధానం :
చేపముక్కలను శుభ్రం చేసి పసుపు రాసి ఉంచాలి. వెడల్పాటి గిన్నెలో కార్న్‌ఫ్లోర్, వెనిగర్, ఉల్లిరసం, కొత్తిమీర, అల్లం-పచ్చిమిర్చి పేస్టు, కారం, మసాలాపొడి, మిరియాలపొడి, ఫుడ్ కలర్, ఉప్పు, తగినన్ని నీళ్లుపోసి చిక్కటి గుజ్జులాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టింటి ఒక గంటసేపు ఊరనివ్వాలి.

ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాగిన తరువాత.. అందులో చేపముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే ఫిష్ స్పైసీ ఫ్రై చాప్స్ రెడీ అయినట్లే..! వీటిని రైస్‌తోపాటు సైడ్‌ డిష్‌గాగానీ, అలాగే అయినాగానీ వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి