వంటకాల్లో నూనె తక్కువగా కనిపించేలా...!
మసాలా కూరల్లో సాధారణంగానే నూనె ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో చాలామంది అమ్మో నూనె అంటూ తగ్గించేయడం మామూలే. అయితే అలాంటి వంటకాల్లోనూ నూనె తక్కువగా కనిపించేలా చేయాలంటే... కూరగాయల్ని ఎక్కువ నూనెలో కాకుండా, రెండు చెంచాల నూనె వేసి, తర్వాత తగినన్ని నీళ్లుపోసి మగ్గిస్తే సరిపోతుంది.
లేకపోతే చాలా కొద్దిగా నూనె వేసి, మసాలాలతో సహా అన్నిరకాల దినుసులు, కూరగాయల ముక్కలు వేసి... సన్నని మంటపై ఉడికించినట్లయితే నూనె తక్కువగా పడుతుంది, వంటకం రుచిగానూ ఉంటుంది.
లేకపోతే చాలా కొద్దిగా నూనె వేసి, మసాలాలతో సహా అన్నిరకాల దినుసులు, కూరగాయల ముక్కలు వేసి... సన్నని మంటపై ఉడికించినట్లయితే నూనె తక్కువగా పడుతుంది, వంటకం రుచిగానూ ఉంటుంది.

