మద్యపాన సేవనం ప్రాణానికే ప్రమాదం
మద్యపానం సేవించడం ద్వారా ఆరోగ్యం పలు వ్యాధులకు చేరువవుతుంది. అయినా మద్యపాన సేవనానికి దూరం కాని వారున్నారు. వారి కోసం కొన్ని జాగ్రత్తలు... హెచ్చరికలు... మద్యం సేవించే వారికి ఆహార వాహికకు పుళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాలేయం, ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి.
దీనితో వీరు తమ జీవితమంతా కడుపునొప్పితో బాధపడవలసి వస్తుంది. రోజూ మద్యం సేవించడం ద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వీటితో గుండె క్యాన్సర్, ఊపిరి తిత్తులకు వ్యాధులు సోకుతాయి. మెదడు చురుకుదనం కోల్పోతుంది.
తరచూ కోపోద్రుక్తులవుతారు. సమాజంలో గౌరవాదరణలు తగ్గుతాయి. ఇందులో ఉండే మత్తు పదార్థాలు మెదడులోని నరాలను బలహీనపరుస్తాయి. దీనితో కాళ్లు, చేతులు వణకడం, తూలడం, మాటల్లో తడబాటు మొదలైనవి ఏర్పడతాయి.
ఎల్లపుడూ మద్యంమత్తులో ఉండేవారికి మనస్థిమితం లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. వీళ్లు ఎటువంటి పని చేయలేరు. ఏ పని మీద శ్రద్ద చూపలేరు. ఈ అలవాటున్నవారికి అధిక రక్త పోటు, గుండె పోటు, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి.
శరీరంలోని నరాలు బలహీనపడి పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పనిచేయడం మానేస్తాయి. కంటి చూపు తగ్గి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. మొత్తంలో ఈ మద్యసేవనం ద్వారా మనిషి ప్రాణానికే చాలా ప్రమాదం ఉందని గ్రహించాలి.
ఇంటిని, ఒంటిని మరచి ఎప్పుడూ తాగుతూ ఉంటే వీరి శరీరానికి అందవలసిన విటమిన్లు, పోషక పదార్థాలు అందక మానసికంగా, శారీరకంగా బలహీన పడిపోతారు. వీటివలన మనసు పాడై ఎన్నో సమస్యలు ఏర్పడి ఇంట్లో సంతోషానికి దూరమై కుటుంబం వీధిన పడే అవకాశాలు ఉన్నాయి.