తరచుగా ఆందోళనకు గురయ్యే వారు, కోపం, బాధలు ఎక్కువగా పడేవారిలో హార్మోన్ల ఉత్పత్తి అధికమవుతుంది.
ఫలితంగా ఎడ్రినల్ గ్రంధి నుంచి విడుదలయ్యే హార్మోన్ అధికంగా స్రవిస్తుంది. దీనివల్ల జీర్ణాశయంలో పెప్సిన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లాల సమతౌల్యం దెబ్బతిని అల్సర్ ఏర్పడుతుంది.
అదే విధంగా 'హెలికో బ్యాక్సర్' అనే బ్యాక్టీరియా జీర్ణాశయంలో అధికమైతే అది శ్లేష్మ పొరపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పెప్టిక్ అల్సర్ కలుగుతుంది.
హైపర్ ఎసిడిటీ లేదంటే అల్సర్ ఏర్పడిన తొలిరోజుల్లో దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే కొత్త ఇబ్బందులు ఏర్పడతాయి. కాలేయ సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు, జీర్ణాశయంలో రక్తస్రావం, జీర్ణాశయం గోడలకు రంధ్రాలు పడే అవకాశం వంటివి తలెత్తే ప్రమాదం ఉంది.
ముందుగా తెలుసుకుని మందులు వాడటం వల్ల ఈ అల్సర్ ను తగ్గించుకోవచ్చు. అయితే తీవ్రతరమైతే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన వైద్య చికిత్సను చేయించుకోవాలి.
|