1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. కథనాలు

ఫంగల్ ఇన్ఫెక్షన్‌ నివారించడం ఎలా?

వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌ అధికంగా వ్యాపిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌ అధికంగా వ్యాపిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రదేశం చూడటానికి అసహ్యంగా కనిపించడంతో పాటు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్‌కు దూరంగా మంచింది. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత అధికమైతే దాని నుంచి బయటపడటం కూడా కష్టమైన పనే. వర్షాకాలం ఇన్ఫెక్షన్ తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది.

ఈ ఇన్ఫెక్షన్‌కు నోటిమాత్రలు, ఆయింట్‌మెంట్లు ఉపయోగించడం ద్వారా త్వరగా నయం చేయవచ్చునని, అయితే దీర్ఘకాలంగా ఉండే ఇన్ఫెక్షన్‌‌కు మాత్రం వైద్య సలహాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం లభించాలంటే కొన్ని నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షను నివారించేందుకు ఆయుర్వేందం, అరమోథెరపీ విధానాలను కూడా పాటించవచ్చును.

ఈ పద్దతుల్లో కొన్ని మీ కోసం... ఆయుర్వేదం ప్రకారం... స్నానం చేయడానికి ముందు శరీరమంతటికి నల్పమర్ది తైలాన్ని పట్టించాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. సోపులకు బదులుగా హెర్బల్ బాడీ స్ర్కబ్‌ను వాడటం మంచిది. లేదా పెరుగు, నీళ్లు ఎలాది చూర్ణంను కలిపి వాడొచ్చు. అలా పై వస్తువులు లేని పక్షంలో పెసరపప్పు, నీళ్లు కలిపైనా వాడుకోవచ్చు. తాజా కూరగాయలు, పళ్లు ఎక్కువగా తినాలి.

పొట్టు తీయని పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. అరమాథెరపీ విధానానికొస్తే... లావెండర్ ఆయిల్‌ రెండు, మూడు చుక్కల్ని తీసుకుని ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో పట్టించండి. ఇలా రోజుకి రెండు మూడు సార్లు రాసుకుంటే ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇంట్లో ఉండే పసుపు, వేపాకులను పేస్ట్‌లా చేసి ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో రాసుకోండి. అర్దగంట తర్వాత శుభ్రంగా తుడిచి గాలికి ఆరనివ్వండి. స్నానం చేసిన తర్వాత మూడు లీటర్ల వేపాకులతో మరిగించిన నీటితో శరీరాన్ని కడగాలి. స్నానానికి అనంతరం ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాల్లో వేపనూనె రాసుకుంటే ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా నివారించవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు.
About Writer
WD