1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. కథనాలు

అసిడిటీ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇదివరకు ఏం తిన్నా హరాయించుకునే వాళ్లం
"ఇదివరకు ఏం తిన్నా హరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి తోస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదని వారు చెబుతున్నారు.

ఈ అసిడిటీతో బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... మామిడి, పుచ్చకాయ, యాపిల్, జామ బంగాళాదుంపలు, ఆకు కూరలు, తేనె, ఖర్జూర, పెరుగు, పంచదార బార్లీ, నట్స్, మైదా, మాంసం గోధుమ వంటి పదార్థాలను భుజించడం ద్వారా శరీరానికి కావాల్సిన ఆమ్లాలు లభిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియంలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు అసిడీటీని తగ్గిస్తాయి.

అసిడిటీని తగ్గించాలంటే...
ఆకులు, ఆవకూర, మెంతి కూర, పాలకూర, క్యాబేజీ, ముల్లంగి ఆకులు, ఉల్లి కాడలు, తోటకూరలను తరిగి ఒకటి్న్నర లీటరు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బలు, నలిపి కలియబెట్టాలి. అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఒంట్లో తేలిగ్గా ఉంటుంది.
About Writer
WD