మనిషి పొడవును ప్రభావింతం చేసే జన్యువులు
మనుష్యులందరూ ఒకేరకమైన పొడవుండరు. కొందరు పొడవుగా ఉంటే మరికొందరు పొట్టిగా ఉంటారు. వారి తల్లితండ్రుల నుంచి వారికి సంక్రమించిన జన్యువులే ఇందుకు కారణమని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
మనిషి పొడవు పెరగడం, పొట్టిగా ఉండడం అనే అంశాలను శరీరంలో ఉన్న జన్యువులు ప్రభావితం చేస్తాయి. దాదాపు 30 వేలమంది పైన నిర్వహించిన పరిశోధనల ద్వారా పరిశోధకులు తేల్చిందేంటంటే పొడవుగా ఉండే అందరిలో కూడా ఓ 20 రకాల జన్యువులు ఒకే రీతిన ఉన్నాయి.
అందువల్ల ఆయా జన్యువులను ప్రభావితం చేయడం ద్వారా పొట్టిగా ఉన్న వారిని పొడవైన వారిగా మార్చవచ్చని వారు చెబుతున్నారు.
అదేసమయంలో మరికొందరు అవసరమైన పొడవుకంటే విపరీతమైన పొడవుతో ఉంటారు. పొట్టివారిగా వారికెంత బాధ ఉంటుందో, విపరీతమైన పొడవున్న వారికి కూడా అదేవిధంగా బాధ ఉంటుంది. అయితే జన్యు చికిత్స చేయడం ద్వారా వారిని ఎక్కువ పొడవు పెరగనీయకుండా చేయవచ్చని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
శరీరం పొడవుతో పాటు దేహంలోని వివిధ అవయవాల ఎదుగుదలపై కూడా ఈ జన్యువులు ప్రభావితం చూపిస్తాయను కూడా ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి జన్యు పరీక్షకు ఉపక్రమించే ముందు ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.