మద్యం తీసుకుంటే ముఖ్యంగా జీర్ణశక్తి నశిస్తుంది. దీంతో మనం చేసే పనిలో కూడా మార్పులు సంభవిస్తాయనడంలో సందేహంలేదు.
మద్యం వలన కలిగే దుష్ఫలితాలు
మద్యం తీసుకోవడంవలన ముఖ్యంగా అది లివర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన ఇది కొవ్వు పదార్థాలలో చేరిపోతుంది. కొవ్వు శరీరంలోని ఏ ఏ భాగాలలోనైతే వుందో అది అక్కడే పేరుకుపోతుంది.
ఈ అలవాటును ప్రారంభపుదశలోనే మానుకుంటే ఆరోగ్యంలో వచ్చే దుష్పరిణామాల నుండి బయట పడగలుగుతారని వైద్కులు అభిప్రాయపడుతున్నారు. ఇంతే కాకుండా లివర్ జబ్బులనుండి కూడా బయట పడవచ్చు.
ఎక్కువగా మద్యం తీసుకునేవారిలో ఆల్కాహాలిక్ హెపటైటిస్ అనే వ్యాధి వస్తుంది. దీనివలన లివర్‌లో వాపు కనపడుతుంది. ఈ పరిస్థితిలో రోగికి ఆకలి కలగక పోవడం, వాంతులు అయ్యేట్టువుండడంలాంటివి జరుగుతాయని వైద్యులు తెలిపారు.
విపరీతంగా మద్యం తీసుకునేవారిలో 70..80 శాతం వరకు కడుపులో నీరు చేరుకుంటుందంటున్నారు వైద్యులు. మద్యం తీసుకోవడం వలన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని తెలిపారు. మద్యాన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు, కాని అదే మద్యం వారిని మింగేస్తుందనడంలో సందేహం లేదు.
కాబట్టి మద్యానికి స్వస్తి పలకి, ఆరోగ్యంగావుండడానికి ప్రయత్నించండి. జీవితాన్ని మద్యంతో అంతం చేసుకోకండి. |