ఆరోగ్యానికి సరళమైన ఉపాయాలు
ఉదయం నిద్రనుంచి లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాగాసనంపై కూర్చొని ఐదు గ్లాసుల నీరు త్రాగాలి. దీనిని ఉషాపానం అంటారు. నీటిని త్రాగేటప్పుడు పూర్తిగా త్రాగేయకుండా నిదానంగా త్రాగాలి. దీంతో నోట్లో ఊరే లాలాజలం నీటితో కలిసి కడుపులోకి ప్రవేశిస్తుంది. ఇలా చేయడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందంటున్నారు వైద్యులు.
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నడకను ప్రారంభించండి. ఉదయం పూట నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే స్వచ్ఛమైన వాయువు శరీరానికి అలాగే ప్రాణవాయువు అందుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎలాంటి జబ్బులకు తావుండదంటున్నారు వైద్యులు.
ప్రతి రోజూ కనీసం మూడు కిలోమీటర్లు నడవాలంటున్నారు వైద్యులు. ఇందులో ఒక కిలోమీటరు వరకు పరుగు పెడితే శరీరంలోని ప్రతి అంగంకూడా కదులుతుంది. దీంతో ఉచ్ఛ్వాస-నిచ్ఛ్వాస క్రియ సంపూర్ణంగా జరుగుతుందంటున్నారు వైద్యులు.
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తేలికపాటి వ్యాయామం చేసి ఉదయం 11గంటలలోపు భోజనం చేసేయాలి. భోజనం చేసేటప్పుడు మెలమెల్లగా ఆహారం నమిలి తినాలి. సాయంత్రంపూట చేయాల్సిన భోజనం సూర్యాస్తమయం కన్నాకూడా ముందే భోజనం చేయాలి. దీనిని నియమంగా పెట్టుకోవాలంటున్నారు వైద్యులు.
ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి పది గంటలకు పైగా నిద్ర మేల్కోకూడదు. రాత్రి పది గంటలకంతా నిద్రకుపక్రమించాలి. దీంతో మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్ర లేవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కనీసం 15 రోజులు ఇదే దినచర్యను పాటిస్తే, తప్పకుండా దీనికి ఫలితం కలుగుతుంది. ఇదే అలవాటు వర్షాకాలంలో, అలాగే చలికాలంలోనే కాకుండా అన్ని ఋతువులలోనూ పాటించాలంటున్నారు వైద్యులు. దీంతో ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందంటున్నారు వైద్యులు.