1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. కథనాలు
  6. Afternoon

Sleep | Afternoon | night | Liquor | caffein | | ఆరోగ్యానికి కమ్మటి నిద్ర

సుఖవంతమైన నిద్రకు సరళమైన ఉపాయాలు

సుఖవంతమైన నిద్ర
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే వ్యాయామం తప్పనిసరిగా చేయాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

సుఖవంతమైన నిద్రకోసం మధ్యాహ్నంపూట పడుకోకండి. రాత్రిపూట నిద్రపోయే ముందు మద్యపానం లేదా కెఫీన్ లాంటి మత్తుపదార్థాలను సేవించకండి. దీంతో మీ నిద్రకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.

ధూమపానం చేయడం వలనకూడా నిద్ర సరిగా పట్టదంటున్నారు వైద్యులు. ఇందులోనున్న నికోటిన్ నిద్రకు భంగం కలిగిస్తుంది.

వివిధ రకాల డ్రగ్స్ తీసుకోవడం వలనకూడా సుఖవంతమైన నిద్రకు భంగం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

కేవలం సాయంత్రంవేళ మాత్రమే వ్యాయామం చేసేవారికైతే రాత్రిపూట నిద్ర సరిగా పట్టదు.

కొంతమంది మహిళల్లో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటివారు తరచూ నిద్రలేమితో బాధపడుతుంటారు. కాబట్టి శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే దానికి తగిన ఆహార పదార్థాలను భుజిస్తే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.

ఉదయం మీరు నిద్రలేవగానే సూర్యుని కిరణాలు ఇంట్లో ప్రవేశించేలా చూడండి. ఎందుకంటే సూర్యరశ్మి వలన శరీరంలో శక్తి వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

రాత్రి పడుకునే సమయంలో మీ పడకగదిలో వెలుతురు తక్కువగా ప్రసరించే లైటును ఉంచుకోండి. దీంతో మీకు చక్కగా నిద్రపడుతుంది.

శరీరానికి కావలసినంత నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. సుఖవంతమైన నిద్రతోనే ఆరోగ్యం ప్రాప్తిస్తుందంటున్నారు వైద్యులు.
About Writer
Gulzar Ghouse