1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. కథనాలు
  6. Heart Disease

Rose hip Powder | Heart Disease | Cholesterol | Health | Blood Pressure | రోజ్ హిప్‌ పౌడర్‌తో హృద్రోగ సమస్యలకు చెక్!

రోజ్ హిప్ పౌడర్
FILE
రోజ్ హిప్‌తో హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలవుతుందని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రోజ్ హిప్ పౌడర్‌ను ప్రతిరోజు పాలలో కలుపుకుని ఆరు వారాలు తీసుకుంటే లోబీపీ, శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.

రోజ్ హిప్ పౌడర్లో సి విటమిన్ ఉండటంతో మధుమేహం, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని స్వీడెన్‌లోని లుండ్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఒబిసిటీ కలిగిన 31 మంది పురుషులు, మహిళలపై ఈ పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలో డయాబెటిస్, గుండెకు సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుందని పరిశోధకులు అంటున్నారు.

ఆపిల్, ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేసే ఈ రోజ్ హిప్ పౌడర్‌ను రోజూ 40 గ్రాములు ఆరు వారాల పాటు తీసుకుంటే గుండెపోటు, మధుమేహం, లోబీపీ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు చెప్పారు.