1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. కథనాలు

కాలేయం భద్రంగా ఉండాలా... కప్పు కాఫీ తాగాల్సిందే!

కాలేయం
FILE
ప్రతి రోజు ఉదయం ఒక కప్పు కాఫీని తాగడం వలన కాలేయం జర భద్రంగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిదికాదనేది చాలామంది అంటుంటారు. కానీ వారి మాటలను అబద్ధం చేస్తూ శాస్త్రవేత్తలు దీనిపై ప్రయోగం చేశారు.

వారు చెబుతున్నది ఏమిటంటే కాఫీ తాగడం వల్ల మన కాలేయాన్ని వివిధ వ్యాధుల బారినుండి రక్షించుకోవచ్చని అంటున్నారు. ఫ్లోరిడాలోని డైజెస్టివ్‌ డిసీస్‌ వీక్‌ 2013 లో ఈ తాజా అధ్యయనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వారి ప్రయోగ ఫలితంలో భాగంగా కాఫీ తాగడం వల్ల కాలేయం పనితీరు పూర్తిగా విఫలం కావడానికి కారణమైన ప్రైమరీ స్కెల్రోసింగ్‌ కొలాంగిటీస్‌ (పీఎస్సీ) వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గినట్టుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ విషయం గురించి ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న కినిక్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ వైద్య నిపుణులు క్రైగ్‌ లామెర్ట్‌ పీఎస్సీ వ్యాధికి గురైన వారు తక్కువగా కాఫీ తాగినట్టు తమ అధ్యయనంలో తేలింది.

కాఫీ తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు. కాబట్టి ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగేసి... కాలేయ ఆరోగ్యం కాపాడుకోవాలని వారి చూచన.
About Writer
SELVI.M