1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

పక్కవారితో పోల్చుకోవడం అవసరమే...!

పక్కవారితో పోల్చుకోవడం అవసరమే...!
FileFILE
సమాజంలోని ప్రతి మనిషీ ఎప్పుడూ పక్కవారితో పోల్చుకుంటుండటం సహజమే. అలా పోల్చుకుంటేగానీ తాను సరైన మార్గంలో వెళుతున్నాడో లేదో అన్న విషయం వారికి ఓ పట్టాన అర్థం కాదు. అందుకే సమస్త మానవాళికి ఈ పోల్చుకోవడం అనే పద్ధతి తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఏ వ్యక్తి అయినా తాను అనుకున్నది సాధించాలంటే... కొన్ని ప్రమాణాలతో సరిపోల్చు కోవాల్సి ఉంటుంది.
వ్యక్తిత్వాలతో సరిపోల్చవద్దు
  బాగా మార్కులు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ... నువ్వు దేనికీ పనికిరానివాడివంటూ ముద్ర వేస్తుంటారు. ఇలాగ పోల్చడంవల్ల అవతలి విద్యార్థి మానసికంగా గాయపడతాడు కాబట్టి అలా చేయకూడదు. చదువును చదువుతోనే పోల్చాలి, చదివే విధానాన్ని పోల్చాలి. అంతేగానీ మొత్తం...      


ఇలా పక్కవారితో పోల్చుకునే అవసరం విద్యార్థులకు కూడా అంతే ఉంటుంది. అదెలాగంటే... తాను వేగంగా వెళ్లాలనుకునే విద్యార్థి పక్క విద్యార్థితో సరిపోల్చుకుంటాడు. పక్క విద్యార్థి సామర్థ్యం ఏంటి? లోపాలేంటి? అన్న విషయాలను గమనించి, అలాంటి లోపాలను తాను చేయకుండా, మరింత శక్తివంతంగా ముందుకెళ్తాడు. కాబట్టే... ప్రతి విద్యార్థికి, పక్క విద్యార్థులతో సరిపోల్చుకోవడం అవసరమవుతుంది.

అయితే...! చాలాసార్లు ఏమవుతుందంటే... అవసరమైన ప్రమాణాలతో కాకుండా ఒక విద్యార్థిని మరో విద్యార్థి వ్యక్తిత్వంతో సరిపోల్చుతుంటారు. ఇది సరైనది కాదు. నిజానికి ఒక విద్యార్థిలో ఉండేది కేవలం ఒక్క చదువు మాత్రమే కాదు. అతడిలో ఉన్న ఎన్నో నైపుణ్యాలలో చదువు కూడా ఒకటి మాత్రమే.
చదువులో మార్కులు తక్కువగా వస్తే... బాగా మార్కులు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ... నువ్వు దేనికీ పనికిరానివాడివంటూ ముద్ర వేస్తుంటారు. ఇలాగ పోల్చడంవల్ల అవతలి విద్యార్థి మానసికంగా గాయపడతాడు కాబట్టి అలా చేయకూడదు. చదువును చదువుతోనే పోల్చాలి, చదివే విధానాన్ని పోల్చాలి. అంతేగానీ మొత్తం వ్యక్తిత్వంతో పోల్చడం వల్ల ఆ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం దెబ్బతింటుంది.

పరీక్షా ఫలితాలలో వ్యత్యాసాలు కనిపిస్తే... వాటికి సరైన కారణాలను పరిశీలించి, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. అలా కాకుండా, కేవలం పోల్చి చూపించి వదిలి వేయటం వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు. చదివే విధాన లోపాలను సవరించుకుని, ప్రయత్న లోపం లేకుండా కష్టపడి చదవాలి.

కాబట్టి పిల్లలూ...! మీరు సాటి విద్యార్థులందరితోనూ సరిపోల్చుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. అలాగే ఎప్పుడూ ఒకే విద్యార్థితో పోల్చి చూసుకోవడం వల్ల మీలో సామర్థ్యం మెరుగుపడకపోగా, ఆ విద్యార్థి పట్ల ద్వేషం పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి... మీలోని లోపాలను సవరించుకుని నైపుణ్యాన్ని పెంచుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం లాంటి పనులే... మీ ఉన్నతికి దోహదపడతాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి