1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

ఇంటర్నెట్ మోజులో పుస్తకాలకు రాంరాం...!

బాలప్రపంచం కథనాలు కిడ్స్ పిల్లలు ఇంటర్నెట్ మోజు ఇంగ్లండ్ డైరెక్టర్ జోనాథన్ సెకండరీ స్కూలు గేమ్స్ కామిక్స్ ఆన్లైన్
FileFILE
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటర్నెట్ మోజు ఎంతగా పెరిగిపోయిందంటే పిల్లలు పుస్తకాల జోలికి వెళ్లడం లేదని తాజా సర్వే బయటపెట్టింది. రాబోయే తరాలను చదివించేలా చేయాలంటే ప్రచురణ కర్తలు ఆధునిక తరం పిల్లల డిమాండ్లకు అనుగుణంగా ఉండే శీర్షికలతో పుస్తకాలు ప్రచురించాలని ఇంగ్లండ్ జాతీయ అక్షరాస్యతా మండలి డైరెక్టర్ జోనాథన్ డగ్లస్ పేర్కొన్నారు.

సాధారణంగా 8 సంవత్సరాల పిల్లలు ఏటా 16 పుస్తకాలు చదువుతున్నారని, అయితే వారు 15 లేదా 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏటా మూడు పుస్తకాలు మాత్రమే చదువగలుగుతున్నారని జోనాథన్ వాపోయారు. సెకండరీ స్కూల్ తొలి సంవత్సరం ముగిసిన వెంటనే పిల్లలు చదివే పుస్తకాల సంఖ్య సగానికి పడిపోతోందని చెప్పారు. ఈ వయసులో ఏటా పిల్లలు చదివే పుస్తకాల సంఖ్య 12 నుంచి 6 కు పడిపోతూ వస్తోందని తెలిపారు.
చదువు చంకనాకింది...!
  పిల్లలు చదవటం మానేయడమే కాదు. కంప్యూటర్లతో కుస్తీ పట్టే రోజులు వచ్చాక గేమ్సే లోకంగా బ్రతికేస్తున్నారు. సాధారణంగా 8 సంవత్సరాల పిల్లలు ఏటా 16 పుస్తకాలు చదువుతున్నారని, అయితే వారు 15 లేదా 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏటా మూడు పుస్తకాలు మాత్రమే చదువ...      


దేశవ్యాప్తంగా 7 నుంచి 16 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న 30 వేల మంది విద్యార్థులను ఈ అధ్యయనం కోసం ఇంటర్‌వ్యూ చేశారు. సెకండరీ స్కూల్‍‌లో రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాక పిల్లల్లో కామిక్స్, మేగజైన్స్, వార్తా పత్రికలు, ఆన్‌లైన్ ఆర్టికల్స్ చదవడం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంలో మునిగిపోతున్నారని ఈ సర్వే తెలిపింది.

చదవటం ఒక పని అనే భావన ప్రస్తుతం పిల్లల్లో కలగడం లేదని, 11 ఏట నుంచే పిల్లల్లో పఠనంపై ఆసక్తి తగ్గిపోతోందని జోనాథన్ తెలిపారు. కాబట్టి ప్రచురణ కర్తలు, పుస్తక వ్యాపారులు పుస్తకానికి కొత్త మెరుగులు దిద్దాలని సూచించారు. మరిన్ని గ్రాఫిక్స్ నవలలను వారు ముద్రించాలని చెప్పారు. పిల్లలు గత తరాల పిల్లల కంటే విజువల్ చైతన్యాన్ని ఎక్కువ పాళ్లలో కలిగి ఉన్నారని, ఈ వాస్తవాన్ని పుస్తక వ్యాపారం ప్రతిబింబించాలను జోనాధన్ తెలిపారు.
పఠనం అనేది స్థిర కార్యాచరణ కాదని అది తరానికి తరానికి బాగా మారుతోందని జోనాథన్ చెప్పారు. ఆన్‌లైన్‌లో అంశాలను స్కాన్ చేస్తున్నప్పుడు తాము చదువుతున్నామనే విషయాన్నే సర్వేలో పిల్లలు గుర్తించలేకపోయారని తెలిపారు. తాము ఆన్‌లైన్‌లో చదవడానికి ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ తాము పాఠకులం కామని పిల్లలో 29 శాతం మంది చెప్పారంటే వీరు సాధారణ చదువుకు ఎంత దూరమయ్యిందీ అర్థమవుతుంది.

చదవటం అనేది పుస్తకాలకు మాత్రమే పరిమితమైన విషయమని వీరు భావిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు పిల్లలలో పఠనాన్ని పెంపొందించేందుకోసం మనం కొత్త వ్యూహాలను అమలు చేయవలసి ఉంటుందని జోనాథన్ చెప్పారు.

ఆన్‌లైన్‌లో ప్రామాణిక గ్రంధాలు, నవలలను చిత్రాలతో సహా అందుబాటులో ఉండేలా తీసుకురావాలని చెప్పారు. పిల్లలు ఏం చదువుతున్నారు అనే శీర్షికతో ఈ అధ్యయనం కొనసాగింది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి