1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

ఇవ్వాళ్టి నుంచే వీరికి కూడా మధ్యాహ్న భోజనం

బాలప్రపంచం కథనాలు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాల తరగతి విద్యార్థులు సోమవారం అమలు హైదరాబాదు శివార్లు మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనం విద్యాశాఖా మంత్రి
FileFILE
ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతోన్న విద్యార్థులకు, సోమవారం నుంచీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

హైదరాబాదు శివార్లలోని బీహెచ్ఈఎల్ వద్దనున్న రామచంద్రాపురం ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇంకా.. డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా త్వరలో వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇప్పటిదాకా ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రమే ఈ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, 7 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విలీనం చేయడం వల్ల... అక్కడినుంచి వచ్చిన విద్యార్థులు ఈ పథకానికి దూరమయ్యారు.

ఈ మేరకు.... 6, 7 తరగతుల వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసినట్లైతే మిగతా విద్యార్థుల పట్ల వివక్ష చూపినట్లవుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లోని అన్ని తరగతుల వారికీ భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే...!

ఇదిలా ఉంటే... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... దేశంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం మనదే కానుంది. కాగా... ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో దాదాపు కోటిమంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి