ఇకపై 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య
|
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పి. చిదంబరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... స్క్రీనింగ్ పద్ధతిలో భాగంగా డొనేషన్లు తీసుకోరాదని, పిల్లలకుగానీ, వారి తల్లిదండ్రులకుగానీ ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదనే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నట్లు తెలిపారు.
అంతేగాకుండా... ఈ బిల్లు ద్వారా చిన్నారులు విద్యను నేర్చుకోవడం ప్రాథమిక హక్కుగా సంక్రమిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును అమలు చేయాల్సిన అధికారిక సంస్థలుగా వ్యవహరిస్తాయని చిదంబరం చెప్పారు. ఇంకా, దేశవ్యాప్తంగా లక్ష పాఠశాలల్లో సురక్షిత మంచినీటి సౌకర్యం కల్పించే పథకాన్ని నవంబరు 14వ తేదీ నుంచి ప్రారంభించాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
అలాగే.. స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల ప్రారంభ స్థాయిలో అనుకూలతలున్న పిల్లలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించే నిబంధనతో సహా, డ్రాఫ్ట్ లెజిస్లేషన్‌కు సంబంధించిన విషయాలన్నింటినీ కూలకుషంగా చర్చించి.. మంత్రివర్గం ఆమోదించినట్లు చిదంబరం వెల్లడించారు. కాగా, ఈ విద్యా బిల్లు 2002 డిసెంబరులో లోక్‌సభ ఆమోదించిన 86 చట్ట సవరణను బలోపేతం చేసే విధంగా రూపొందించడం జరిగింది.
