1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

ఒకేసారి ముద్దు... ఎక్కువగా వద్దు..!

బాలప్రపంచం కథనాలు అమ్మ అన్న స్వీటీ అలక చాక్లెట్లు ఏడుపు మాయం తాయిలం దంతక్షయం పరిశోధకుడు మార్క్ హెల్పిన్
అమ్మ, అన్నల మీద అలిగిన స్వీటీ అదేపనిగా ఏడుస్తోంది. స్వీటీ ఏడ్చినప్పుడో, అలిగినప్పుడో ఎలా దారిలోకి తేవాలో వాళ్ళమ్మకు బాగానే తెలుసు. స్వీటీ బలహీనత చాక్లెట్లు. ఎంత ఏడుస్తున్నా సరే, కాసిన్ని చాక్లెట్లు దాని ఒళ్లో పోస్తే చాలు.. ఏడుపు మాయమవుతుంది.

స్వీటీ కథను కాసేపలా పక్కన పెడితే.... చిన్నారులు ఏడుస్తున్నప్పుడు వారికి తాయిలంగా చాక్లెట్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా టెంపుల్ విశ్వవిద్యాలయానికి పరిశోధకుడు డాక్టర్ మార్క్ హెల్పిన్ ఈ విషయంపై మాట్లాడుతూ... చాక్లెట్లను ఒకేసారి తినటం వల్ల దంతక్షయాన్ని నివారించవచ్చని, అదే కొద్ది మోతాదులోనైనా సరే తరచుగా తింటే మాత్రం దంతక్షయం బారిన పడక తప్పదని అంటున్నారు.

ఎన్ని చాక్లెట్లను తిన్నాం అనే దానికన్నా ఎన్నిసార్లు తీసుకున్నాం అనే అంశానికి దంతాల ఆరోగ్యానికి సంబంధం ఉందని హెల్పిన్ అభిప్రాయం. చక్కెర పదార్థాలు స్వీకరించేటప్పుడు ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అనే విషయాన్ని తప్పనిసరిగా గమనించాలని ఆయన సూచించారు.

తీపి పదార్థాలు, పిండి పదార్థాలు అధికంగా ఉండే బంగాళాదుంప చిప్స్ లాంటి వాటిని భోజన సమయంలో తీసుకోవటం వల్ల దంత సంబంధ వ్యాధులు, జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని హెల్పిన్ వివరించారు. భోంచేసే సమయంలో బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాల వల్ల పంటిలో రంధ్రాలు పడే అవకాశం అధికంగా ఉంటుందని ఆయన అన్నారు.

భోజన సమయంలో అధికంగా లాలాజలం ఊరుతుంటుంది, మధ్యలో ద్రవ పదార్థాలు కూడా తీసుకుంటుంటాం కాబట్టి బ్యాక్టీరియా చిగుళ్లలో ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని హెల్పిన్ పేర్కొన్నారు. ఒకేసారి కాకుండా పలు దఫాలుగా చాక్లెట్లను తినటం వల్ల సూక్ష్మక్రిములు దాడిచేసే ప్రమాదం అధికంగా ఉంటుంది, కాబట్టి పిల్లలు నిద్రకు ఉపక్రమించే సమయంలో తీపి పదార్థాలను అస్సలు ఇవ్వకూడదని హెల్పిన్ హెచ్చరించారు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి