"సిగరెట్ ప్రేమికులూ".. మీ పిల్లలు జాగ్రత్త సుమా...!!
సిగరెట్ ప్రేమికుల్లారా...! మీ పిల్లల గురించి కూడా కాస్తంత ఆలోచిద్దురూ..!! పొగ తాగడం అనే వ్యసనం వల్ల మీకే కాదు... మీ కుటుంబ సభ్యులకూ, ముఖ్యంగా మీ చిన్నారులకు హాని చేస్తుందని అమెరికాలోని మాస్ జనరల్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ (ఎంజీహెచ్‌సీ) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
పొగతాగే అలవాటున్నవాళ్లు చాలామంది ఆరుబయటనో, పిల్లలు దగ్గరగా లేని సమయంలోనో దమ్ముకొడుతుంటారు. ఇలా చేయడం వల్ల పొగాకులోని విషయ రసాయనాల ప్రభావం తమ పిల్లలపై ఉండదని వారు భావిస్తుండవచ్చు. అయితే... పొగరాయుళ్లు ఎక్కడ ఉండి పొగతాగినా, దాని ప్రభావం పిల్లలపై పడకమానదని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.
పై పరిశోధనలకు నాయకత్వం వహించిన ఎంజీహెచ్‌సీ అసెస్టెంట్ డైరెక్టర్ జొనాథన్ వినికాఫ్ మాట్లాడుతూ... పొగరాయుళ్లు ఎక్కడ ఉండి పొగ తాగినప్పటికీ... సిగరెట్ కాల్చగానే అందులోని విష రసాయనాలు వారి దుస్తులు, తల వెంట్రుకలపై పేరుకుపోతాయని, పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు అవి వారిలోకి చేరిపోతాయని వివరించారు.
ఇలా జరగడాన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అని పిలుస్తారని.. ఒకవేళ మగవారు కాకుండా, పిల్లలకు పాలిచ్చే మహిళలయితే... పాల ద్వారా విషరసాయనాలు చేరతాయని వినికాఫ్ చెప్పారు. కాబట్టి, పాలిచ్చే తల్లులు ఎవరైనా తమ ఆ అలవాటును మానుకోనట్లయితే, పిల్లలకు డబ్బా పాలు తాగించటమే ఉత్తమమని ఆయన సలహానిచ్చారు.
ఇదిలా ఉంటే... సిగరెట్ పొగలో దాదాపు 250 రకాల విషవాయువులు, కొన్ని హానికరమైన లోహాలు, 11 క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పిల్లలను ముద్దు పెట్టుకునే లేదా ఆడించే సమయంలో పొగతాగేవారి పెదవులు, చేతులపై పేరుకున్న రసాయనాలు కూడా వారికి హానికారకాలుగా పరిణమిస్తాయని వినికాఫ్ పేర్కొన్నారు.
కాబట్టి... ధూమపాన ప్రేమికులుగా ఉన్న తల్లిదండ్రులు, తమ చిన్నారుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచైనా, ఆ అలవాటుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు కదూ..!!